వరంగల్ జిల్లా నర్సంపేటలో మంగళవారం రైతు, కార్మిక, వ్యవసాయ సంఘాల నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆయా సంఘాల నేతలు మాట్లాడుతూ బీజేపి ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక, మనువాద విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈనెల 26న నిర్వహించబోయే భారీ నిరసన, ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. బీజేపీ ప్రభుత్వంలో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.