కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తానని తెలిపిన ఎమ్మెల్యే

262பார்த்தது
కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తానని తెలిపిన ఎమ్మెల్యే
జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్తులు తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి ఎమ్మెల్యే డా. తాటికొండ రాజయ్య ని పుష్పగుచ్ఛం అందించి మర్యాదపూర్వకంగా కలిసి కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని కోరగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే డా. రాజయ్య తన ఎమ్మెల్యే సీడీఎఫ్ నిధుల నుండి మొదటిదాపాగా 5 లక్షలు అదేవిధంగా రెండవదాపాగా 5 లక్షలు కలుపుకుని మొత్తంగా రూ. 10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కి ముదిరాజ్ లు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ &నియోజకవర్గ BRS పార్టీ కో ఆర్డినేటర్ గుజ్జరి రాజు , తిమ్మాపూర్ సర్పంచ్ పొన్నాల జ్యోతినాగరాజు, నియోజకవర్గ BRS పార్టీ బిసి సెల్ కో ఆర్డినేటర్ పెండ్లి స్వామి ఘన్పూర్ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ పెంతల రాజ్ కుమార్, టిఆర్ఎస్ గ్రామ శాఖ ఎర్ర నరేష్, ముదిరాజ్ కుల పెద్దమనిషి చిక్కుడు రామచంనద్రు, సోమయ్య, రాజు, లు, నాగయ్య, సాయిలు, శ్రీను, సమ్మయ్య, లు పరశురాములు కొమురెల్లి నాగయ్య, సారయ్య, కులస్తులు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி