స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాఫర్ గడ్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పులి స్వామికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అందచేశారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, వైస్ చైర్మన్ చల్లా చందర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ పెంతల రాజ్ కుమార్, యాకనాధం తదితరులు పాల్గొన్నారు.