కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కృషి చేయాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. గురువారం మహేశ్ కుమార్ గౌడ్ ను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి సింగపురం ఇందిర కలిశారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ అంశాలపై చర్చించినట్లు ఇందిర తెలిపారు.