మహిళా పొదుపు సంఘాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. గీసుగొండ మండల ప్రగతి సమాఖ్య 15వ వార్షికోత్సవం కోనాయిమాకుల వద్ద మండల సమాఖ్య భవనంలో మంగళవారం జరిగింది. సీఎంతో మాట్లాడి టెక్స్ టైల్ పార్కు పరిశ్రమల పనులు ఇంటివద్దనే మహిళలచే చేయించేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.