అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను సక్రమంగా, మరింత సమర్థవంతంగా అమలు చేయడానికే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం జారీ చేస్తున్నదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పనకు సంబంధించిన పైలెట్ ప్రాజెక్టు సర్వే జరుగుచున్న ప్రక్రియను, కుటుంబ సభ్యుల వివరాల నమోదును శనివారం సంగెం మండలం కృష్ణానగర్ గ్రామంలో ఎమ్మెల్యే పరిశీలించారు.