నేరఆరోపణతో వచ్చే ఫిర్యాదులపై స్టేషన్ అధికారులు తక్షణమే కేసు నమోదు చేయాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. బుధవారం ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు చేరుకున్న సీపీకి పరకాల ఏసీపీ కిశోర్, సీఐ సంతోష్ మొక్కను అందజేసారు. ఈ తనిఖీల్లో రిసెప్షన్ సిబ్బంది పనితీరును, పెండింగి కేసులు, రౌడీ షీటర్ల వివరాలు తెలుసుకున్నారు.