![](https://media.getlokalapp.com/cache/56/61/5661e6cfde218f9f1175d7028429b53b.webp)
![](https://amp.dev/static/samples/img/play-icon.png)
శ్రీసోమేశ్వర ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన స్వయంభు శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం ఈ సందర్భంగా హనుమాన్ జయంతి ఉత్సవంలో భాగంగా విఘ్నేశ్వర పూజ, మూల విరాట్ కి పంచామృత చందన అభిషేకములు, అష్టోత్తర అర్చన, ఉత్సవ మూర్తికి విశేష అభిషేకములు, పూర్ణాహుతి నీరాజన మంత్ర పుష్పములు తీర్థప్రసాద వితరణ చేశారు.