పాలకుర్తి: పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన మృతుడి బంధువులు

81பார்த்தது
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో శనివారం హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే బాధితుడు మానసికంగా ఇబ్బందులకు గురై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేసుకుని చనిపోయాడని గిరిజన సంఘాల నేతలు, మృతుని కుటుంబ సభ్యులు, మహిళలతో కలిసి పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి.

தொடர்புடைய செய்தி