పాలకుర్తి మండల కేంద్రంలోని మేకల తండా గ్రామానికి చెందిన లకావత్ శ్రీను పోలీస్ స్టేషన్ లో నిన్న ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నంకు పాల్పడి వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారి జామున మృతి చెందగా, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లకావత్ శ్రీను బౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి న్యాయం జరిగే వరకు వెన్ను దండుగా ఉంటానని హామీ ఇచ్చినారు.