మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ఉత్పత్తిని తగ్గించడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే వార్తలను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ఖండించారు. ప్రపంచంలో చమురు కొరత ఏమాత్రం లేదని, కావాల్సిన దానికంటే ఎక్కువే అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. త్వరలోనే ధరలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యారెల్ క్రూడాయిల్ ధర 73 డాలర్లుగా ఉంది.