పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో డీసీపీ రాజమహేంద్ర నాయక్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. లూనావత్ శీను ఆత్మహత్యకు కారణమైన ఆరుగురుపై కేసు నమోదు చేసాం. ఆరుగురిని ఈ రోజు రిమాండుకు తరలిస్తాం అన్నారు. మృతుడికి న్యాయం జరిగే విధంగా జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ తో మాట్లాడి ప్రభుత్వ పరంగా రావలసిన అన్ని అందించే విధంగా చూస్తాం అన్నారు.