పాలకుర్తి: పోలీసు స్టేషన్ ముందు ఫ్లెక్సీతో నిరసన

72பார்த்தது
జనగాం జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్ ముందు శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీస్ స్టేషన్ కు వందలాదిగా మృతుడి బంధువులు తరలివచ్చారు. ఎస్సై నిర్లక్ష్యం వల్ల బలి అయిన మేకల తండాకు చెందినటువంటి లకావత్ శ్రీను అని ఫ్లెక్సీతో నిరసన తెలుపుతూ దహన సంస్కారాలు పోలీస్ స్టేషన్ ముందే చేయాలని ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆందోళనకారులకు ఫోన్ లో కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాష సర్ది చెప్పారు.

தொடர்புடைய செய்தி