శ్రీ చండికా అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం

63பார்த்தது
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభువు శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొలువైన శ్రీ చండికా పరమేశ్వరిదేవి ఆలయములో శ్రీ వరలక్ష్మి వ్రతంను ఘనంగా నిర్వహించారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్బంగా వివిధ ప్రాంతాల నుండి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు శ్రీ చండికా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందించారు.

தொடர்புடைய செய்தி