సీఐ మహేందర్, ఎస్సై సాయి ప్రసన్న లను సస్పెండ్ చేయాలంటూ పాలకుర్తి పోలీస్ స్టేషన్ ఎదుట లకావత్ శ్రీను ఆత్మహత్య కు పాల్పడిన ఘటనపై మృతుడి తల్లిదండ్రులు శనివారం జాతీయ ఎస్టీ కమీషన్ ను ఆశ్రయించారు. స్పందించిన ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోతు హుస్సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ మహేందర్ రెడ్డి, ఎస్ఐ ప్రసన్నకుమార్ లపై చర్యలు తీసుకోవాలని, గిరిజన కుటుంబానికి జరిగిన అన్యాయం పై పూర్తి విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తామని అన్నారు.