బాలికను వేధిస్తున్న వ్యక్తిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. పాలకుర్తి సీఐ వివరాల ప్రకారం దేవరుప్పుల మండలంలోని బోడబండ తండాకు చెందిన యాకు కొద్దిరోజులుగా ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని వేధిస్తున్నాడు. ఈ విషయమై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అమ్మాయిలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.