జనగామ జిల్లా పాలకుర్తి మండలకేంద్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బుధవారం శివరాత్రి పర్వదినం సందర్బంగా శివనామస్మరణతో ఆలయ ప్రాంగణంమారుమోగుతుంది.
ఉదయం నుండి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకుని క్షీరగిరిపై ప్రదక్షిణ చేస్తూ గండదీపంలో దీపారాధన చేస్తున్నారు.