క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి

610பார்த்தது
క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి
మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ క్యాలెండర్ - 2023ను సోమవారం స్థానిక విశ్రాంతి భవనంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు సంస్థ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ సేవలు అభినందనీయం అన్నారు. తొర్రూరు మండల పరిధిలో అంబులెన్స్ సేవలు, మున్సిపల్ పరిధిలో శుద్ధిత త్రాగునీరు అందిస్తు ప్రజల మన్ననలు పొందుతుందని గుర్తు చేశారు. మండల ప్రజల అవసరార్థం ఫ్రీజర్ బాక్స్ సేవలను ప్రారంభించనున్న సంస్థ వ్యవస్థాపకులు సిరికొండ విక్రమ్ కుమార్ ను ప్రశంసించారు. సంస్థ చేసే కార్యక్రమాలకు తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி