వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో తరగతులు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ అధికారులతో కలిసి నూతనంగా నిర్మించిన జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏ బ్లాక్, సి బ్లాక్ భావనాలను, సమకూర్చిన ఫర్నిచర్, పరికరాలను పరిశీలించారు.