పోలీసుల వైఖరిపై వరంగల్ సీపీకి పెద్ది లేఖ

54பார்த்தது
పోలీసుల వైఖరిపై వరంగల్ సీపీకి పెద్ది లేఖ
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో పోలీస్ అధికారుల వైఖరి సరిగా లేదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మంగళవారం వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝాకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, పోలీస్ స్టేషన్లలో బిఆర్ఎస్ నాయకులకు కనీస మర్యాద ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులకు మాత్రమే సేవలు చేస్తున్నారని పేర్కొన్నారు. పక్షపాత ధోరణి అవలంభిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி