వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్య నాయకులతో ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 19న వరంగల్లో జరిగే ప్రజా పాలన విజయోత్సవ సభను విజయవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గం నుంచి 10 వేల మంది రావాలని కోరారు. ఆరు మండలాలతో పాటు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతంగా నిర్వహించాలన్నారు.