వరంగల్ జిల్లా మాదన్నపేట శివాలయం లో బుధవారం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాదన్నపేట కట్టపైన ఉన్నా శివాలయం నిర్మాణదాత, ప్రముఖ పారిశ్రామికవేత్త దొడ్డ మోహన్ రావు తో కలిసి పెద్ది సుదర్శన్ రెడ్డి మహా శివరాత్రి సందర్భంగా భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు.