కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆశాలకు 18 వేల రూపాయల వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి కి వినతిపత్రం అందజేశారు. ఆశాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరి చేపించుకుంటుందని పల్స్ పోలియో, లెప్రసీ సర్వే పనులు చేయించుకొని ఇప్పటికీ ఒక రూపాయి ఇవ్వలేదని అన్నారు.