చెన్నారావుపేట: తనకు న్యాయం చేయాలని యువకుడి ఆవేదన

56பார்த்தது
చెన్నారావుపేట: తనకు న్యాయం చేయాలని యువకుడి ఆవేదన
ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన బర్ల పూర్ణచందర్ బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. 2022లో నర్సంపేటలోని ఓ ప్రైవేట్ చిట్ ఫండ్ శాఖలో రూ. 10 లక్షల చిట్టీ వేశానన్నారు. రూ. 1. 50 లక్షలు చెల్లించిన తర్వాత సరిపడా సభ్యులు కాలేదని తిరిగి డబ్బులు చెల్లిస్తామని నిర్వాహకులు హామీ ఇచ్చారన్నారు. దీనిపై జనవరి 23, 2023లో నర్సంపేట ఠాణాలో ఫిర్యాదు చేయగా, ఇటీవల ఏసీపీ కిరణ్ కుమార్ విచారించి సదరు సంస్థపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితుడు వాపోయాడు.

தொடர்புடைய செய்தி