ఈనెల 17న వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభం కానున్నట్లు సమాచారం. శనివారం కొత్తగా నిర్మించిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, జిల్లా కలెక్టర్ శారదా పరిశీలించారు. ఈ విద్యా సంవత్సరం మెడికల్ కళాశాల తరగతులను కొనసాగించనున్నారు. కళాశాల ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించనున్నట్లు సమాచారం.