లారీలను తప్పించబోయి కింద పడ్డ బైక్

3272பார்த்தது
లారీలను తప్పించబోయి కింద పడ్డ బైక్
ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం. మంగళవారం మంగపేట మండలం తిమ్మంపేట క్రాస్ వద్ద మడే రమేష్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై మంగపేట వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో ఇసుక లారీలు అడ్డు రావడంతో తప్పించబోయి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఏటూరునాగారం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ములుగు రెఫర్ చేశారు.

தொடர்புடைய செய்தி