ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో మంగళవారం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ర్యాలీ, మానవహారం చేశారు. జన విజ్ఞానవేదిక, జ్వాల యూత్, గ్రామ పంచాయితీ అధికారులు అధ్వర్యంలో గ్రామంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.