ములుగు జిల్లా వెంకటాపురం మండలం బీసి మర్రిగూడెం గ్రామంలో శునకానికి తిప్పలు తప్పలేదు. ప్లాస్టిక్ డబ్బాలో ఏదో ఉన్నదని తినడానికి డబ్బలో తలపెట్టడంతో ఒక్కసారిగా గట్టిగా ఇరుక్కుపోయి రెండు రోజుల నుండి ఇబ్బంది పడుతుంది. ఆకలితో నడవలేక తిప్పలు పడుతు ఇంటింటికి తిరుగుతూ అలసిపోతుంది. గ్రామస్తులు కుక్కను వెంబడించి పట్టుకొని తలలో ఇరుక్కుపోయిన ప్లాస్టిక్ డబ్బాని తీయడంతో సంతోషంతో పరుగులెత్తింది.