ములుగు జిల్లాలో మంగళవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకున్న గవర్నర్ కు మంత్రి దనసరి అనసూయ సీతక్క మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర, జిల్లా ఎస్పీ శబరిష్, డిఎస్ఓ రాహుల్ కిషన్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.