ములుగు జిల్లా వ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఇటీవల భారీ వర్షాలతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ్లు తెగి రవాణా స్తంభించింది. వాగులు, వంకలు ఉప్పొంగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో వ్యాపారులు, విద్యార్థులు బయటికి వెళ్లేందుకు జంకుతున్నారు.