ములుగు జిల్లాలో పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. గత కొన్ని రోజులుగా వర్షాలు లేక నాట్లు పెట్టిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా మరో పక్క ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు వర్షం కాస్త ఉపశమనం కలిగించిందని పేర్కొన్నారు. వర్షం దంచికొడుతుండడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.