తాడ్వాయి మండలంలోని మేడారం ఉరటంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కె ఎస్ ఎస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఆదివారం స్పోర్ట్స్ వస్తువులు పంపిణీ చేశారు. అదేవిధంగా కేసెస్ ఫౌండేషన్ చైర్మన్ సందీప్ కోల మాట్లాడుతూ ఆడపిల్లలకు వ్యాయామం చాలా అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దుర్గం రమణయ్య,అంజన రావు కావిరి, మరియు ఫౌండేషన్ సభ్యులు పట్టం ప్రశాంత్, ఉదయ్, లక్ష్మణ్, చందు, తదితరులు పాల్గొన్నారు.