రేవంత్ రెడ్డి మొనగాడు కాదు మోసగాడు: హరీష్ రావు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతుల రెండు లక్షల సంపూర్ణ రుణమాఫీ కావాలని ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని, డిసెంబర్ 9వ తేదీ లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి, ఆగస్టు 15వ తేదీ వరకు కూడా చేయలేదని విమర్శించారు.