మహబూబాబాద్ శివారులోని రాజ్యాలి పేట గ్రామం మెయిన్ రోడ్డులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. నల్ల కోడి, కుంకుమ, పసుపు, ఎరుపు కలిగిన బియ్యాన్ని మూటగా చేసి రోడ్డుమీద గుర్తుతెలియని వ్యక్తులు పడేసారని ఆదివారం స్థానికులు తెలిపారు. రాజాపేట లో ఇప్పటివరకు ఒక సీసీ కెమెరా కూడా లేదని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా వినిపించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. క్షుద్ర పూజల కలకలంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు