పార్లమెంట్లో గురువారం జరిగిన జీరో అవర్లో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ నియోజకవర్గ సమస్యలపై మాట్లాడారు. పార్లమెంట్ నియోజకవర్గంలో గిరిజన ఆదివాసులతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో నివసించే ప్రజలు ఎక్కువగా ఉన్నారని, వారు విద్యకు చాలా దూరంగా ఉన్నారని వాపోయారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా పార్లమెంట్ పరిధిలో మూడు కొత్త నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థులకు చదువును అందించాలని కోరారు.