మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తానని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. శనివారం రాయపర్తి మండలం, మైలారం గ్రామంలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో మత్స్యకారులకు అధికారులతో కలిసి చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్స్యకారులకు అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.