సైబర్ మోసం ... రూ.92,000 నగదు మాయం

60பார்த்தது
సైబర్ మోసం ... రూ.92,000 నగదు మాయం
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వీణా కంగనాల్ యజమాని శ్రీనివాస్ ఫోన్ కు గురువారం రాత్రి వరుసగా మెసేజ్ లు వచ్చాయి. వాటిని ఓపెన్ చేసి చూడగా మొదటగా 60 వేలు ఆ తర్వాత 32 వేలు ఆయన బ్యాంక్ అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ అయ్యాయని మెసేజ్ లు వచ్చి ఉన్నాయి. ఈ ఘటనపై శుక్రవారం ఉదయం శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ హ్యాక్ చేసి ఈ పని చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி