పట్టించుకోని పాలనా యంత్రంగా

300பார்த்தது
పట్టించుకోని పాలనా యంత్రంగా
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం చిన్న ముప్పారం గ్రామం రేకుల తండాకు చెందిన బానోతు సైదులు తండ్రి హేమ యొక్క సర్వే నంబర్ 117/16, 117/4/1 గల మూడు ఎకరాల భూమిని గత 50 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నామని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పట్టా పాస్ బుక్, రైతుబంధు చెక్కులు రాలేదని వాపోయారు. గతంలో ఇదే సర్వే నంబర్ పై బ్యాంకు లోను, వివిధ లోన్ తీసుకోవడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు రైతుబంధు పథకం అందలేదని తెలిపిన రైతు కుటుంబం. రెవెన్యూ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி