జిల్లా కేంద్రమైన జనగామ మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో ఇందిర మహిళా శక్తి పథకం కింద ఏర్పాటుచేసిన శ్రీ అన్నపూర్ణేశ్వరి మెస్ ను అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా మణులు ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సాధికారిక దిశగా కొనసాగాలని ప్రభుత్వ ఆశయం నెరవేర్చాలని తోటి వారికి ఆదర్శంగా నిలవాలన్నారు.