జనగామ జిల్లాలో పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో డిసిపి రాజ మహేంద్ర నాయక్ తో కలిసి 10వ తరగతి వార్షిక పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది పరీక్షలకు 41 సెంటర్లలో 6238 మంది విద్యార్థులు హాజరునున్నట్లు తెలిపారు.