జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి వారి ప్రసాద కేంద్రాన్ని తనిఖీ చేసినట్లు పుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ శ్రీ సోమేశ్వర ఆలయాన్ని దర్శించుకునే భక్తుల కోసం తయారీ చేస్తున్న ప్రసాదాల(లడ్డు) తయారీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి తగిన సూచనలు చేసినట్లు తెలిపారు.