మహిళల కోసం రూపొందించిన భద్రత చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) జనగాం జిల్లా బాలికల విభాగం కన్వీనర్ దాసగాని సుమ అన్నారు. గురువారం జనగామ జిల్లా దేవరుప్పులలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో మహిళలు, ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలపై తగిన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కీర్తన, మానస, ధన్వంతి, చందన, కావ్యలు పాల్గొన్నారు.