భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ చేర్యాల డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో చేర్యాలను రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేస్తూ రాష్ట ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని పాత బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, కార్యదర్శులు ఆముదాల రంజిత్ రెడ్డి, దాసరి ప్రశాంత్ లు మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని అనేక పోరాటాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.