సామాన్యులు, మద్యతరగతి ప్రజలు కూరగాయలు కొనే పరిస్థితి లేకుండా పోయిందని ధరలు చూస్తే గుండె అదిరిపోతుందని మాజీమంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ అన్నారు. మహబుబాబాద్ జిల్లా కురవి సంతలో సోమవారం కూరగాయలు కొనుగోలు చేసిన ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ ధరలు పెరుగుదలను స్వయంగా పరిశీలించారు. టమాటా కిలో రూ. 80 నుండి రూ. 100 ఉందని ప్రతి కాయగూరలకు ధరలు పెరిగాయన్నారు. ధరల నియంత్రణ ప్రభుత్వ వైఫల్యంగా ఆమె పేర్కొన్నారు.