బతుకమ్మ చివరి రోజు కావడంతో డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో గురువారం రాత్రి మాజీ సర్పంచ్ రాంప్రసాద్ బతుకమ్మ ఆడి సందడి చేశారు. కోలాటాలు ఆడి స్టెప్పులు వేశారు. వారు మాట్లాడుతూ కులాలకు, మతాలకు అతీతంగా పండుగ చేసుకోవాలన్నారు. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జగదిష్, మాజీ ఉప సర్పంచ్ శేషయ్య, కనక దుర్గ కమిటి వారు తదితరులు పాల్గొన్నారు.