కార్తీక పౌర్ణమి పండుగ సందర్బంగా సీరోల్ మండలం మన్నెగూడెం శ్రీ పార్వతి రామలింగేశ్వర శివాలయంలో శుక్రవారం ఉదయం నుంచి భక్తులు సందడి మొదలయింది. అర్చకులు ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆడపడుచులంతా కలిసి ఆలయానికి వచ్చి దీపాలను వెలిగించారు. దీంతో ఆలయం ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఆలయంలో పండుగా వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువత, తదితరులు పాల్గొన్నారు.