మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం మూలమర్రి తండా సమీపంలో వ్యవసాయ క్షేత్రం వద్ద శనివారం భూక్యా బిచ్చ అనే రైతుకు చెందిన రెండు కాడెడ్లు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద షాక్ కు గురై మృతి చెందాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల లక్ష రూపాయల కాడెడ్లు మృత్యువాత పడ్డాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపరిహారం అందించాలని ప్రభుత్వంను వేడుకున్నారు.