భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు లోని మేడిగడ్డ బ్యారేజికి బుధవారం భారీ వరద వచ్చి చేరుతుంది. బ్యారేజి కి 8, 85, 620 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుండంతో 85 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. అన్నారం బ్యారేజీ కి 4, 08, 787 క్యూసెక్కుల వరద రావడంతో 66 గేట్ల ద్వారా అంతే స్థాయిలో నీటిని అధికారులు దిగువకు పంపిస్తున్నారు.