భూపాలపల్లి జిల్లా మంజూరునగర్లో నివసిస్తున్న కలెక్టర్ రాహుల్ శర్మ ఆదివారం ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలో వివరాలు నమోదు చేసుకున్నారు. సర్వే ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేటర్ ఆలూరి రమేష్ జిల్లా కలెక్టర్ కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేశారు. ప్రభుత్వం అందించే సేవలు మరింత సమర్థవంతంగా అందించడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. జిల్లాలో సర్వే ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చిందని ఆయన పేర్కొన్నారు.