రుణమాఫీ ప్రక్రియపై రైతులకు, సలహాలు సూచనలు అందజేసేందుకు జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం, అలాగే భూపాలపల్లి, మహాదేవపూర్ కార్యాలయాలల్లో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవసాయ అధికారిని ఆదేశించారు. సోమవారం రుణమాఫీ ప్రక్రియపై రైతుల నుండి దరఖాస్తులు వస్తున్నాయని అందువల్ల వారి సమస్యలు నివృత్తి చేసేందుకు హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.